హైదరాబాద్ రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఎట్ హోం’ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆహ్వానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర ప్రముఖులను ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాదికీ ప్రత్యేక ఏర్పాట్లతో అతిథులను ఆహ్వానించారు. రాజకీయ నేతల రాకతో రాజ్‌భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉదయం నుంచే వైభవంగా జరిగాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రజలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణలో అమలు అవుతున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.

Leave a Reply