• బుధవారం మరో రెండు గేట్లు ఎత్తివేత..
  • మొత్తం 6 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తిన వైనం..
  • 2.01లక్షల క్యూసెక్కులు నీరు నాగార్జునసాగర్ విడుదల…


నంద్యాల బ్యూరో, ఆగస్టు 13 (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా కుండపోత వర్షాలు (Torrential rains) కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక (Maharashtra, Karnataka) లో సైతం కురుస్తున్న వర్షాల మూలంగా శ్రీశైలం జ‌లాశ‌యంలోకి నీరు అధికంగా వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణమ్మ (Krishnamma) పరవళ్లు తొక్కుతోంది.

ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంకు భారీగా వరద వచ్చి చేరుతుంది. అధికంగా శ్రీశైలం జలాశయంలోకి 1,51,611 క్యూసెక్కుల నీరు రావడంతో బుధవారం మరో రెండు రేడియల్ క్రస్ట్ గేట్ల (Radial crust gates) ను అధికారులు 10అడుగుల మేర ఎత్తారు. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ (Nagarjuna sagar) కు ఆరు గేట్ల ద్వారా పది అడుగుల మేర ఎత్తి 2,01,457 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల (Jurala, Sunkeshula barrages) నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,51,611 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 65,655 క్యూసెక్కులను దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైల జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 882.90 అడుగులున్నాయి. జలాశయంలో నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థ్యం 203.8907 టీఎంసీలుగా నమోదైంది.

విద్యుత్ ఉత్పత్తికి కుడి ఎడమల నుంచి 65,655 క్యూసెక్కుల నీటిని సాగరకు విడుదల చేస్తున్నారు. ఏపీ జల విద్యుత్ (AP Hydro Power) కోసం30,340 క్యూసెక్కుల నీటిని వాడుతుండగా, తెలంగాణ ప్రాంతం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని జల విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. ముచ్చటగా ఈ ఏడాది మూడోసారి 6 రెడీయల్ క్రస్ట్ గేట్లే ను పది అడుగుల మేర ఎత్తడంతో ప్రయాణికుల సందడి మొదలైంది.

Leave a Reply