ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని బరేలీలో ఈ దారుణం జరిగింది. భార్య, ఆమె సోదరులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేయాలని ప్రయత్నించగా దారినపోయే అపరిచితుడు వారి అఘాయిత్యాన్ని అడ్డుకుని ఆ వ్యక్తిని కాపాడాడు. ఉత్తర ప్రదేశ్ ఇజ్జత్ నగర్ (Izzatnagar police station) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. రాజీవ్ (Rajeev) అనే వ్యక్తి ఓ వైద్యుని వద్ద సహాయకునిగా పనిచేస్తున్నాడు. అతని భార్య సాధన (sadhana) రాజీవ్ హత్యకు ప్లాన్ వేసింది. ఇందుకు తన ఐదుగురు సోదరులను (five brothers) ఒప్పించి హత్యకోసం కిరాయి గూండాలను (goons) మాట్లాడాల్సిందిగా కోరిందని తెలుస్తోంది.

ఈనేపథ్యంలో గతనెల 21న 11మంది గూండాలు రాజీవ్ పై దాడి చేసి అతని చేయి, రెండు కాళ్లను విరిచేశారు. అతడిని అలా బతికుండగానే పూడ్చాలని ప్లాన్ (plan) వేసుకుని తమకు దగ్గరలోని సిబిగంజ్ (cb gang) అనే ప్రాంతంలో ఉన్న అడవికి తీసుకుని వెళ్లి గోతిని తవ్వారు. వాళ్లు అతడిని సజీవంగా పూడ్చేసేవారే, కానీ ఇంతలో అటుగా వెళుతున్న ఒక వ్యక్తి వచ్చి వారిని అడ్డుకున్నాడు. దాంతో దుండగులు రాజీవ్ ని అలాగే వదిలిపారిపోయారు.

శరీరంలో ఎముకలు (bones) విరిగిపోయి బాధతో విలవిల్లాడుతున్న రాజీవ్ ని ఆ వ్యక్తి అంబులెన్స్ ని రప్పించి హాస్పిటల్ లో చేర్చాడు. రాజీవ్ కి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. అతని తండ్రి రాజీవ్ భార్య, సోదరులు ఇతర దుండగులపై పోలీసులకు (police) ఫిర్యాదు చేశాడు. రాజీవ్ కు, సాధనకు 2009లో వివాహమైంది. వీరికి 14ఏళ్లు, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. వీరికి వారి గ్రామంలో ఇల్లు ఉండగా సాధనకు పల్లెటూరు ( village) లో ఉండటం ఇష్టం లేకపోవటంతో సిటీ (city) లో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు.

Leave a Reply