MDK | సిలారపు రాజనర్సింహకు మంత్రి దామోదర్ నివాళులు

మెదక్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి (Former Minister of Andhra Pradesh), బడుగు, బలహీన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం శాసనసభ్యులుగా, చట్టసభలలో సుదీర్ఘ పోరాటం చేసిన దార్శనికులు సిలారపు రాజనర్సింహ (Silarapu rajanarsimha) వర్ధంతి సందర్భంగా వారి తనయుడు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) సంగారెడ్డి (Sangareddy)లోని వారి నివాసంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజనర్సింహ అందించిన సేవభావాన్ని, రాజకీయ విలువలను, ఆశయాలను, అందోల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం చేసిన కృషిని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్మరించుకున్నారు. అందోల్ నియోజక వర్గం నుండి 1967, 1972, 1978 శాసన సభ్యులు గా హ్యాట్రిక్ సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సుదీర్ఘ కాలం పాటు సేవలను అందించి చిరస్థాయిగా నిలిచారని మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు.

Leave a Reply