Raashi Khanna | ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశి ఖన్నా ఎంట్రీ..

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్‌కి చివరకు పవన్ డేట్లు కేటాయించడంతో యూనిట్ పునర్‌జీవం పొందింది. సినిమా పనులను తక్కువ సమయంలో పూర్తి చేయాలని దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ సంకల్పం చేసుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోందన్నది అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో రాశి ఖన్నా కూడా జాయిన్ అవ్వడం విశేషం. పవన్ కళ్యాణ్ తో కలిసి రాశి ఖన్నా తొలిసారి నటిస్తుండటంతో, వీరి కాంబో-కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉన్న రాశి ఖన్నా, ఈ సినిమాలో తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది.

ఇటీవల రాశి పెద్ద సినిమాల్లో కనిపించకపోవడంతో సిద్దూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమా మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్న రాశి, ఇప్పుడు పవన్ ప్రాజెక్ట్‌కి ఎంపిక కావడం తో తన కెరీర్‌కి కొత్త ఊపందిస్తుందని భావిస్తోంది. అలాగే శ్రీలీల కూడా వరుసగా వచ్చిన ఫిలింలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఈ సినిమాపైనే పెద్ద నమ్మకం పెట్టుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా జరుగుతోంది. రాశి ఖన్నా షూటింగ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుండగా, ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది.

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ మూవీ యూనిట్ ప్రకటించనుంది.

One thought on “Raashi Khanna | ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశి ఖన్నా ఎంట్రీ..

Leave a Reply