HYD | భారీ వర్షంతో నీట మునిగిన కాలనీలు : బోట్లతో రంగంలోకి దిగిన హైడ్రా

హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ప‌లు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కొనసాగింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన కాలనీలు వరద నీటితో మునిగిపోతున్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు నగరానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

సికింద్రాబాద్‌లోని పైగా కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హైడ్రా అధికారులు వెంటనే బోట్ల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ పరిశీలిస్తున్నారు.

Also Read: http://Anaswara Rajan | టాలీవుడ్ లో అడుగుపెడుతున్న అన‌శ్వ‌ర రాజ‌న్

మరోవైపు వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. GHMC, HMDA, వాటర్‌ వర్క్స్, విద్యుత్‌, పోలీస్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజల ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.

సికింద్రాబాద్ పైగా కాలనీతో పాటు మాసబ్‌ట్యాంక్‌, హైటెక్‌ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్‌పల్లి, హాఫిజ్‌పేట్‌లోనూ భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటు ఐటీ కరిడార్‌లోని కొండాపూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌లో భారీ వర్షాలతో ట్రాఫిక్‌ పూర్తిగా స్థంభించింది.

Also Read TG | తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంకులు వేయకండి – సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఈ రాత్రి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Also Read సినిమా న్యూస్

Leave a Reply