హైదరాబాద్‌మలక్ పేట్ ( Malakpet) పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ ( Salivahana Nagar Park ) వద్ద దారుణం చోటుచేసుకుంది. శాలివాహన నగర్ పార్కు దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు ( four persons ) కారులో (car) వచ్చి చందు రాథోడ్ ( Chandu rathod ) అనే వ్యక్తి పై కాల్పులు జరిపి పారిపోయారు..
చందు రాథోడ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సీపీఐ ( CPI ) నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ ( morning walk) చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు. స్నేహితుల తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్ కంట్లో కారం చల్లారు దుండగులు. వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ వెంటాడి వెంబడించి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి స్విఫ్ట్ కార్లో పరారయ్యారు దుండగులు. హత్య సమయంలో 5మంది పాల్గొన్నట్లు ప్రాథమిక అంచనా.
హత్య కి గలా కారణాలు పాతకక్షలు గా ప్రాథమిక అంచనా.. నాగరకర్నూల్ జిల్లా అచంపేటకి చెందిన చందు రాథోడ్ కుటుంబంతో చైతన్యపురిలో నివాసం ఉంటున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా.. బల్మూరు మండలం నర్సాయిపల్లి స్వస్థలం.. నర్సాయపల్లి లో తల్లిదండ్రులు ఉంటారు..ఇతను 30 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడని తెలిసింది.
చందు నాయక్ పై కాల్పులు జరిపి హత్య చేసింది కూడా సిపిఐ నాయకుడే.. సిపిఐ ఎంఎల్ నాయకుడు రాజేష్ కాల్పు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు.. ఇద్దరి మధ్య ఉన్న భూ వివాదమే కాల్పులకు దారి తీసింది అంటున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు.