- చరిత్ర సృష్టించిన సిన్నర్
ప్రపంచ నంబర్ వన్, ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ 2025 విమ్బుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచి చరిత్ర లిఖించాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ ఆల్కరాజ్ పై సెంటర్ కోర్ట్‌లో నాలుగు సెట్లలో సిన్నర్ విజయం సాధించాడు.
ఆల్కరాజ్ మొదటి సెట్‌ను 6-4తో గెలిచాడు. అయితే ఆ తర్వాత సిన్నర్ తన దూకుడు చూపించి వరుసగా మూడు సెట్లు 6-4, 6-4, 6-4తో గెలిచి ఆల్కరాజ్కి హ్యాట్రిక్ టైటిల్ కలను చెదరగొట్టాడు. ఈ మ్యాచ్ మూడు గంటల నాలుగు నిమిషాలు సాగింది.
ఇది సిన్నర్ కెరీర్లో తొలిసారి విమ్బుల్డన్ విజయం కాగా.. ఈ గెలుపుతో సిన్నర్ నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఖాతాలో వేసుకున్నాడు.