Devotional| అమ్మలు గన్న అమ్మకు సారే సమర్పించిన సిపి రాజశేఖర్ బాబు దంపతులు

ఎన్టీఆర్ బ్యూరో ,ఆంధ్రప్రభ, : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున విజయవాడ కమిషనరేట్ పోలీసులు 2017 నుండి కనకదుర్గమ్మ వారికి పవిత్ర సారే సమర్పించడం ఆనవాయ వస్తుంది. కనకదుర్గమ్మ ను తమ ఇంటి ఆడపడుచు గా భావిస్తూ ఎన్నో ఏళ్లగా అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ అమ్మవారికి సారె సమర్పిస్తూ వస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నగర పోలీస్ శాఖ తరపున అమ్మవారికి ఆసాడసారే సమర్పించుటకు ఆదివారం సాయంత్రం గొప్ప ఊరేగింపుగా డప్పు, వేషధారణల నడుమ రావడంతో వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి కే శీనా నాయక్ ఘాట్ రోడ్డు మీదుగా వచ్చి న ఊరేగింపునకు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు అనంతరం సిపి రాజశేఖర్ బాబు దంపతులు కనకదుర్గమ్మ వారికి పవిత్ర ఆషాడసారె ను సమర్పించారు. పోలీస్ శాఖ లో పని చేస్తున్న అధికారుల సిబ్బంది కుటుంబ సమేతంగా సిపి రాజశేఖర్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారి సారే కార్యక్రమంలో పాల్గొన్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న 75 వేలమంది భక్తులు

అమ్మలు గన్న అమ్మ … ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ కనకదుర్గమ్మ కరుణాకటాక్షాల కోసం వేలాదిగా ఇంద్రకీలాద్రికి భక్తజన సంద్రోహం తరలివస్తున్నారు. తెలుగింటి ఆడపడుచు కనకదుర్గమ్మకు పవిత్ర ఆషాడ సారే సమర్పించేందుకు ఊరు, ప్రాంతం, రాష్ట్రం ఇలా ఎల్లలు దాటి తరలివస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి వార్ల దేవస్థానంలో కొలువైన జగన్మాతకు ఆషాడసారె సమర్పించేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం ఒక్కరోజే కనకదుర్గమ్మవారిని సుమారు 75 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.

వారాంతపు సెలవులు నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్రతో పాటు, తెలంగాణ నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి సారీ సమర్పించేందుకు వేల సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలోని క్యూ లైన్ లన్నీ కిక్కిరిస్తాయి.

భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అన్ని క్యూలైన్లో టికెట్లను, విఐపి బ్రేక్ దర్శనాలను రద్దుచేసి, సామాన్య భక్తులందరికీ శీఘ్ర దర్శనం కల్పించేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ముందస్తు అంచనా నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి సమయం పడుతున్న నేపథ్యంలో భక్తులకు విరివిగా బిస్కెట్ ప్యాకెట్లతో పాటు, మంచినీటి బాటిల్ అన్న సైతం మొట్టమొదటిసారిగా క్యూలైన్లో ఉచితంగా అందజేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో భక్తులకు ఉపశమనం కలిగించే రీతిలో ప్రత్యేక టెంట్ల ఏర్పాటు, భక్తులు నడుస్తున్న ప్రాంతాలలో చల్లటి నీటిని కార్పెట్లను తడుపుతూ ఉప సమయాన్ని కలిగించే ఏర్పాట్లు చేశారు. …

పరమ పవిత్రం ఆషాడ సారే…ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచు గా భావించే కనకదుర్గమ్మకు ప్రతి ఆట ఆషాడమాసంలో పసుపు కుంకుమ గాజులు చీర తో పాటు పలు రకాల పండ్లు, స్వీట్స్ ను సారె రూపంలో అమ్మవారికి భక్తులు సమర్పిస్తుంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ పవిత్ర సారెను ప్రతి ఒక్క మహిళ అమ్మవారికి సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి తరలివస్తుంటారు.

జూన్ 26వ తేదీ నుండి ప్రారంభమైన ఆషాడసారె మహోత్సవంలో భాగంగా ఈ పద్దెనిమిది రోజులలో సుమారు నాలుగున్నర లక్షలకు పైగా భక్తుల అమ్మవారిని దర్శించుకుంటే, ఇందులో 98% మంది మహిళా భక్తులే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది బృందాలుగా ఏర్పాటు చేసుకుని ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనానంతరం మహా మండపం ఆరవ అంతస్తులో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు అనంతరం సారే సమర్పిస్తుంటారు.

మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి కూడా అత్యధిక సంఖ్యలో ఈ ఏడాది భక్తులు రావడం విశేషం….. ప్రత్యేక ఏర్పాట్లు…జగన్మాతకు పవిత్ర ఆషాడసారె సమర్పించేందుకు వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

అన్ని క్యూ లైన్ నుండి ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం, అమ్మవారి శీగ్ర దర్శనం అనంతరం మహా మండపంలో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు చేసిన అనంతరం పవిత్ర సారె సమర్పణకు విస్తృత ఏర్పాట్లు చేశారు.సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముందస్తుగా ప్రత్యేక క్యూ లైన్లు, విఐపి దర్శనాలను రద్దు చేయడంతో పాటు బంగారు వాకిలి ద్వారా అమ్మవారి దర్శనం భాగ్యాన్ని కల్పిస్తున్నారు.

అలాగే క్యూలైన్లో ఎదురుచూస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ ఏడాది బిస్కెట్ ప్యాకెట్లతోపాటు, వాటర్ బాటిల్లను కూడా ఉచితంగా అందజేశారు. భక్తుల రద్దీ దృశ్య ఇంద్రకీలాద్రితో పాటు కనకదుర్గ నగర్ లోని అన్ని ప్రాంతాలలో ఆలయ అధికారులు సిబ్బంది అనునిత్యం పర్యవేక్షిస్తూ, రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. క్షణక్షణం అన్ని ప్రాంతాలలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నా కార్యనిర్వాహణాధికారి వీకే శినా నాయక్ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదంతో పాటు, అన్నప్రసాద ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. …

Leave a Reply