Cordon Search | అసాంఘిక శక్తులపై పోలీసుల ఉక్కు పాదం

.నంద్యాల బ్యూరో .. ఆంధ్రప్రభ… శాంతిభద్రతల పరిరక్షణ నేరం నియంత్రణలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నిర్వహించారు.

జిల్లాలోని అన్ సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో చేపట్టిన వివరాలు…నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోన్నాపురం కాలనీ నందు ఇన్స్పెక్టర్ కృష్ణయ్య ఎస్సై గంగ యాదవ్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో సరైన ధ్రువపత్రాలు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకోన్నారు.ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుకుంద గ్రామం లో ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో సరైన ధ్రువపత్రాలు లేని పది మోటర్ సైకిల్ 14 క్వాటర్ బాటిల్లును స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మకూరు రూరల్ సర్కిల్ లో పాములపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జూటూరు గ్రామం లో ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ నిర్వహణలో సరైన ధ్రువపత్రాలు లేని 09 మోటార్ సైకిల్లు,31 క్వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.నందికొట్కూరు యు పి ఎస్ లో ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని జగనన్న కాలనీలో రికార్డులు లేని 10 బైక్‌లు మరియు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

రూరల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం జూపాడుబంగ్లా ఎస్ఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మండ్లెం గ్రామం, జూపాడుబంగ్లో లో సరైన రికార్డులు లేని 15 బైక్‌లు, 15 అక్రమ మద్యం బాటిల్లు, 7 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కోవెలకుంట్ల సర్కిల్ సంజామల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకుమల్ల గ్రామం లో ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ రమణయ్య ల ఆధ్వరం లో సరైన ధ్రువపత్రాలు లేని 12 మోటార్ సైకిల్ 6 ఆటోలను స్వాధీనం చేసుకున్న రు.రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసాపురం గ్రామం లో ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో సరైన ధ్రువపత్రాలు లేని 21 మోటర్ సైకిలను స్వాధీనం చేసుకొన్నారు.

డోన్ సబ్ డివిజన్ బేతంచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల బుగ్గానిపల్లె గ్రామం లో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు సిబ్బంది సహాయంతో సరైన ధ్రువపత్రాలు లేని 6 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకోన్నారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, అనుమానితులు, నేర చరిత్ర గల వారి ఇల్లులను పోలీస్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అనుమానితుల వేలిముద్రలను మొబైల్ సిస్టం చెక్ డివైస్ ద్వారా పరిశీలించరు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరికలు జారీ9 చేశారు.ప్రజలు డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.

Leave a Reply