Megastar Chiranjeevi | చిరు అసలు పేరుతో ‘మెగా 157’ !!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న “మెగా 157” సినిమా ప్రకటించిన రోజు నుంచే అభిమానుల్లో భారీ క్రేజ్‌ను సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమా టైటిల్ చిరంజీవి అసలు పేరు ఆధారంగా పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదేటైటిల్ రోల్ లో చిరు క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా, ప్రస్తుతం ఈ మాస్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి 2026కి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఇక‌ ఈ సినిమా ఫైన‌ల్ టైటిల్ ‘మన శివ శంకర వర ప్రసాద్ గారు’ అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమా టైటిల్ టీజర్ ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే అభిమానులకు ఇది డబుల్ డోస్ పండుగ అని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, వెంకటేష్ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply