నివేదిక విడుదల చేసిన ‘ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో
ఏకకాలంలో రెండు ఇంజన్ లు ఆగిపోవడంతోనే..
పైలెట్స్ ఆటో టర్బైన్స్ ఆన్ చేసినా ఫలితం శూన్యం
ఏక కాలంలో రెండు ఇంజన్ లు ఆగిపోవడం ఇదే ప్రథమం
ప్యూయల్ విడుదల సక్రమంగానే ఉంది
రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సక్రమమే
ఏ పక్షి విమానాన్ని ఢీకొన లేదు
ఆకస్మికంగా ఏర్పడిన సాంకేతిక లోపంతో…
కేవలం 32 సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిన ఫ్లైట్
న్యూ ఢిల్లీ – అహ్మదాబాద్ లో (ahmedabad ) జూన్ 12న ఘోర విమాన ప్రమాదం (flight accident ) జరిగిన సంగతి తెలిసిందే. టెకాఫ్ (takeoff ) అయిన కొన్ని క్షణాలకే ఎయిరిండియా విమానం (air india flight ) ఒక్కసారిగా జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న 19 మంది మృతి చెందారు. ఈ క్రమంలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ‘ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (AAIB) తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడించింది.
ఈ ప్రమాద ఘటనపైప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది.సకాలంలో రెండు ఇంజిన్లూ పనిచేయకపోవడంతోనే విమానం కూలిపోయింది అని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
” కాక్ పీట్ లో పైలెట్ల ఆఖరి మాటలు ఇవే!:
టేకాఫైన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లయ్ ఆగిపోవడంతో రెండు ఇంజన్లూ పనిచేయడం మానేశాయి. “ఎందుకు ఫ్యూయల్ కటాఫ్ చేశావ్” అని ఒక పైలట్ అడగ్గానే.. నేను కటాఫ్ చెయ్యలేదు అని రెండో పైలట్ చెప్పాడు. కాక్‌పిట్ ఆడియో రికార్డుల్లో ఈ వాయిస్ ఉంది. ఇంజిన్లు పవర్‌ను కోల్పోగానే ఆటోమేటిక్‌గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏఏఐబీ దగ్గర ఉంది. వెంటనే ఇంజన్లను రీస్టార్ట్ చెయ్యడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంజన్1 రికవర్ అయినా ఇంజన్2 మొరాయించడంతో 32 సెకన్లలోనే విమానం కూలిపోయిందని నివేదిక తెలిపింది.
విమానంలో ఫ్యూయల్ క్లీన్‌గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రిఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తేలింది. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలా లేదని, పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు కనిపించలేదని తెలిపింది. పైగా ఆకాశం క్లియర్‌గా ఉంది. వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్‌కి అనువుగానే ఉన్నాయి. విమానంలో మోతాదుకు మించిన బరువులు కూడా ఏవీ లేవు. పైలట్లు ఇద్దరూ మంచి అనుభవుజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తడి లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఏఏఐబీ చెబుతోంది. కుట్ర కోణానికి సంబంధించిన ఆధారం ఏదీ లభించలేదని కూడా తేల్చేసింది
గాల్లో కేవలం 32 సెకన్లపాటే …
ఈ విమానం ప్రమాదానికి ముందు 32 సెకన్ల పాటు మాత్రమే గాల్లో ఉన్నట్లు ఏఏఐబీ వెల్లడించింది. రన్ వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలోని విమానం కూలిపోయిందని వివరించింది. ఇంజిన్లు శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్ ఎయిర్ టర్బైన్ ను యాక్టివేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఇదే క్రమంలో… మేడే కాల్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ.. ఎలాంటి స్పందన రాలేదని.. అందుకు కారణం అప్పటికే విమానం కూలిపోయిందని ఏఏఐబీ వివరణ ఇచ్చింది.