హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, (Madhav ) ఏపీ మంత్రి లోకేశ్‌కు (nara lokesh ) ఇచ్చిన భారత చిత్రపటంలో (India map) తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ (sorry ) చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు..
తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బిజెపి అధికారిక విధానమా..? అని ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో నరేంద్ర మోదీకి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ అని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. అయితే, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం? ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? అని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కల్తీకల్లుతో ఆరుగురు మరణిచండం బాధకరం
హైదరాబాద్‌లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలి. ఒక్కొక్క కుటుంబానికి రూ. 20 లక్షలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నానని కేటీఆర్ తెలిపారు. కుటుంబం కోసం కాయకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇంతమంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకాపోవడం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.