హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు (city civil court ) బాంబు బెదిరింపు (bomb ) ఫోన్ కాల్ వచ్చింది. సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు (police ) కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. కోర్టు సిబ్బందిని బయటకు పంపించేశారు. బాంబు స్క్వాడ్ (bomb squad ) , డాగ్ స్క్వాడ్‌తో (dog squad ) పోలీసులు తనిఖీలు (chekckings )నిర్వహించారు. చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని మూసివేశారు. న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Threatening Call | సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు
