నిజామాబాద్ ప్రతినిధి (ఆంధ్రప్రభ): నిజామాబాద్ నగరంలోని ఆర్యవైశ్య పట్టణ సంఘ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదివారం నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటింగ్ సందర్భంగా బ్యాలెట్ పత్రాలు చింపివేసి దొరికిన ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ ఘటనపై పోటీలో ఉన్న అభ్యర్థులు బైఠాయించి నిరసనలు తెలుపుతూ, ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరగలేదని.. బ్యాలెట్ పత్రాలు చిరిగిపోయి దొరికాయని చెబుతూ, దీనికి ఎన్నికల అధికారులే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు.