జగ్గయ్యపేట : కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి గాయాలైన ఘటన ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని గురునానక్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శశికళ తన పిల్లలతో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ విజయవాడ (Vijayawada) లోని కేఎల్ యూనివర్సిటీలో రివ్యూ మీటింగ్ (Review meeting) కి వెళుతుండగా గౌరవరం జాతీయ రహదారిపై ట్రాలీని తప్పించిపోయి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కొడుకు జానంపల్లి సాత్విక రెడ్డి (15) మృతిచెందగా, గాయపడ్డ తల్లీ కూతుర్లను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Jaggaiahpet | డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
