AP | దైవ దర్శనానికి వెళ్లి వస్తూ… తిరిగిరాని లోకాలకు
- ఓర్వకల్లులో కారు ట్రాక్టర్ డి
- ఓ మహిళ, బాలిక మృతి
- ఆరుగురికి గాయాలు
ఓర్వకల్, (ఆంధ్రప్రభ) : తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా… ఘోర ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రైనింగ్ డీఎస్పీ ఉషశ్రీ, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్సై సునీల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఓర్వకల్లు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అనంతరం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతులు లక్ష్మీ జానకి (44), విరాణిక శ్రీ (4)గా పోలీసులు గుర్తించారు. రథసప్తమి సందర్భంగా ఈ నెల మూడో తేదీన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన రెండు కుటంబులు (12 మంది) తిరుపతికి విచ్చినట్లు తెలిపారు.