హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి IAS అరవింద్ కుమార్ కు అవినీతి నిరోధక శాఖ (ACB) నోటీసులు జారీ చేసింది. జూలై 1వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ACB ఎదుట బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ తదుపరి దర్యాప్తును ముమ్మరం చేసింది.
Formula E Race Case | ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటీసులు
