Phone Tapping | మంత్రి గా ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాపింగ్ – ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షిగా (witnt) మల్కాజ్గిరి బీజేపీ (BJP) ఎంపీ ఈటల రాజేందర్ (eatala Rajender ) సిట్ విచారణకు మంగళవారం హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమే అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తన ఫోన్ అనేకసార్లు ట్యాపింగ్ అయ్యిందని చెప్పారు. నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్ మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు
.2021 ఉప ఎన్నికల సమయంలో…2021లో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తాను ఏ కార్యకర్తతో మాట్లాడితే వాళ్ల ఇంటికి వెళ్లి పదవులు డబ్బులు ఆశచూపి ఓడించే ప్రయత్నం చేశారని రాజేందర్ తెలిపారు. 2023లో గజ్వెల్లో, హుజురాబాద్లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు.
ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం అక్రమం అని చెప్పారు. తనకు అనుకూలంగా ఉన్నవాళ్లను కేసీఆర్ అప్పట్లో నియమించుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎందుకు నివేదికలను బయటపెట్టడంలేదని అడిగారు.
