Breaking: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

హైద‌రాబాద్ : తెలంగాణ ఎడ్‌సెట్ (TG EdCET) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి (Balakishta Reddy), కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రతాప్ రెడ్డి (Pratap Reddy) ఫలితాలను విడుదల చేశారు. జూన్ 1వ తేదీన రెండు సెషన్‌లలో పరీక్షను నిర్వహించారు.

ఎడ్ సెట్‌కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇప్పటికే ప్రైమరీ కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. ఇక నేడు ఫైనల్ కీ, ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఎడ్‌సెట్ అఫిషియల్ వెబ్‌సైట్ https://edcet.tgche.ac.in/# లో చెక్ చేసుకోండి.

Leave a Reply