హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం తాజాగా డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపును ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. జనవరి 1 2023 నుండి ఈ పెంపు అమల్లోకి రానుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఉద్యోగుల డీఏను 3.64 శాతం మేర పెరగనుంది.