Yadadri Bhuvanagiri : టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ హనుమంతు వేకప్ కాల్

సంస్థన్ నారాయణపురం ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): పదవ తరగతిలో సీ గ్రేడ్ విద్యార్థుల కోసం తలుపు తట్టే కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల పరిధిలోని కంకణాలను గూడెం గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉదయాన్నే ఐదు గంటలకు కంకణాలగూడెంలోని భరత్ చంద్ర విద్యార్థి ఇంటికి వెళ్లారు…నేను జిల్లా కలెక్టర్ ని వచ్చాను ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థితో మాట్లాడారు.

.పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిది మీ అమ్మ నిన్ను ఇంత కష్టపడి చదివిస్తునందుకు నువ్వు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి మీ అమ్మ కి సంతోషాన్ని ఇవ్వాలని సూచించారు. పదవ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు.కష్టపడి చదివి తల్లితండ్రులకు , గురువులకు, జిల్లా కి మంచి పేరు తీసుకరావాలని సూచించారు.

భరత్ జీవితంలో స్థిరపడేవరకు సహకారం అందిస్తానని తెలిపారు.తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు.భరత్ తనకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని కలెక్టర్ గారే స్వయంగా ఇంటికి రావటం నమ్మలేక పోతున్నానని కలెక్టర్ సర్ రావటంతో తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *