AP | కేడీసీసీ చైర్మన్ గా నెట్టెం బాధ్యతల స్వీకరణ..

(ఆంధ్రప్రభ విజయవాడ) : కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని కేడీసీసీ రీజినల్ కార్యాలయంలో నెట్టం రఘురామ్ గురువారం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు.

బ్యాంకు అధికారులు, సిబ్బంది, నాయకుల సమక్షంలో కేడీసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నెట్టెం రఘురాంను విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. నెట్టెం రఘురాం అనుభవం కేడీసీసీ అభివృద్ధికి ఎంతగానో సహాయ పడుతుందని ఈ సందర్భంగా ఎంపీ చిన్ని అన్నారు. నెట్టం రఘురాం కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కేడీసీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply