జన్నారం, (ఆంధ్రప్రభ): ఉమ్మడి జిల్లాలోని కవ్వాల పులుల అభయారణంలోని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఇస్లాంపూర్ అడవుల నుంచి అక్రమంగా వెదురుబొంగులు తరలిస్తున్న రెండు వ్యాన్లను మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ అధికారులు పట్టుకున్నారు.
స్థానిక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత,బీట్ ఆఫీసర్లు లాల్బాయ్, తిరుమలేష్ లు ఇస్లాంపూర్ నుంచి తరలిస్తున్న వెదురు బొంగుల రెండు వ్యాన్లను మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపాన పట్టుకున్నారు.
ఆ వెదురు బొంగులను ఇస్లాంపూర్ నుంచి డీసీఎం వ్యానులో నిర్మల్ కు, మరో మినీ వ్యాన్ ను జగిత్యాల జిల్లా ధర్మపురికి తరలిస్తున్నట్లు డ్రైవర్ శేఖర్ తెలిపారు. ఈ విషయమై స్థానిక తాళ్ల పేట రేంజ్ ఆఫీసర్, స్థానిక ఇన్చార్జి వి.సుష్మారావును రాత్రి సంప్రదించగా, రెండు మినీ వ్యాన్లను వెదురు బొంగులతో పట్టుకున్నామన్నారు. విచారణ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు.