AP | తుని రైలు దహనం కేసు – రీ ఓపెన్ కు ప్రభుత్వం రెడ్ ఫ్లాగ్ ..

వెల‌గ‌పూడి – తుని రైలు దహనం కేసు లో అప్పీల్ వెళ్ల‌నుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేసును రీ ఓపెన్ చేసే అలోచ‌న లేద‌ని తేల్చి చెప్పింది.. అప్పీల్ కోసం విడుద‌ల చేసిన ఉత్వ‌ర్వుల‌ను కొట్టి వేస్తూ నేడు ప్ర‌భుత్వ మ‌రో జీవోను విడుద‌ల చేసింది.. వాస్త‌వంగా అప్పీల్ కు విడుద‌ల చేసిన జీవోపై పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని సంబంధిత అధికారుల‌ను ప్ర‌భుత్వం కోరింది..

కాగా, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో చేర్చాలంటూ 2016 జనవరి 31న బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వస్తున్న రైలును దహనం చేశారు. ఆ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి రైల్వే పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ 2023 మే 1న రైల్వే కోర్టు ఈ కేసు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో ముద్రగడ సహా పలువురిపై న‌మోదైన కేసులు కొట్టివేస్తూ గతంలో విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది.

Leave a Reply