YSRCP | మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తా … ఎపిని 30 ఏళ్లు పాలిస్తాః జ‌గ‌న్…

తాడేప‌ల్లి – తిరిగి అధికారంలోకి వ‌స్తాన‌ని, ఈసారి ఏక‌ధాటిగా 30ఏళ్లు ఎపిని పాలిస్తాన‌ని చెప్పారు వైసిపి అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు.. దొంగ కేసులు పెడతారు.. అలాగే జైల్లో సైతం పెడతారని.. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని స్పష్టం చేశారు. మీకు మంచి చేసిన వారినీ.. అలాగే చెడు చేసిన వారినీ.. ఇద్దరినీ గుర్తుపెట్టుకొండంటూ పార్టీ శ్రేణులకు కీలక సూచన చేశారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్ధలోని వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముఖ్య నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఒక్కటే గుర్తు పెట్టుకొండంటూ పార్టీ కేడర్‌కు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ జగన్ 2.0 వేరుగా ఉంటుందన్నారు. ఈసారి కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తాని తెలిపారు. గతంలో పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యత ఇవ్వ లేకపోయానని చెప్పారు.

అయితే పార్టీలోని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టమని జగన్ హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్‌ కేసులు వేస్తామని స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెడతాంటూ వారికి భరోసా కల్పించారు.

గత జగన్ ప్రభుత్వ హాయంలో కార్యకర్తలకు అంత గొప్పగా చేయ లేక పోయిండవచ్చు.. కానీ ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకు వచ్చారని.. వారి కోసమే తాను తాపత్రయపడ్డానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వారి కోసమే తన టైం కేటాయించానని.. ప్రజల కోసమే అడుగులు వేశానన్నారు.

అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు.. మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశానన్నారు. అలాగే కార్యకర్తల బాధలను సైతం గమనించానని చెప్పారు. వారి అవస్ధలను సైతం చూశానని.. వీళ్ల కోసం అండగా ఉంటాడని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు నడుపుతున్నారన్నారు.

Leave a Reply