హైదరాబాద్,ఆంధ్రప్రభ : టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు (ఆదివారం) సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పూర్వ చైర్మన్ జి చిన్నారెడ్డి నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్ ), వంశీ కృష్ణ (అచ్చంపేట ), వీర్లపల్లి శంకరయ్య (షాద్‌నగర్) , రాజేష్‌రెడ్డి ( నాగర్ కర్నూల్ ) మేఘారెడ్డి (వనపర్తి ), కసిరెడ్డి నారాయణ రెడ్డి (కల్వకుర్తి ), శ్రీహరి ముదిరాజ్ (మక్తల్ ), మలరెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం ) శుభాకాంక్షలు తెలియజేశారు.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత తొలిసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎంపీ మల్లు రవికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌లో టాప్‌లేని కారులో ఊరేగింపుగా గాంధీభవన్ చేరుకున్నారు. గాంధీభవన్ వద్ద కూడా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బాణసంచా కాల్చుతూ డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.