LSG vs RCB | ఆఖ‌రి లీగ్ మ్యాచ్.. హై-వోల్టేజ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ !

  • ప్లేఆఫ్స్ ఆశతో ఆఖరి పోరుకు దిగనున్న బెంగ‌ళూరు

లక్నో: ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశకు ముగింపు పలుకుతూ ఈరోజు (మంగళవారం) లక్నోలోని భారత్ రత్న అటల్ బిహారి వాజపేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి.

టాస్ అప్డేట్ !

కాగా, ఈ హైవోల్టేజ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో సొంత మైదానంలో ల‌క్నో జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.

తుది జ‌ట్లు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషార.

లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, విలియం ఓ’రూర్కే.

ప్లేఆఫ్స్‌పై ప్రభావం:

లక్నో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసులో నుండి ఎలిమినేట్ అవ్వ‌గా.., లక్నో తమ అభిమానుల ముందు విజయంతో సీజన్‌ను ముగించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా, ప్రత్యర్థుల ఆశలకు దెబ్బతీయాలనే ధ్యేయంతో మైదానంలో దిగనుంది.

మరోవైపు, బెంగళూరు జ‌ట్టు మాత్రం టాప్-2లో స్థానం సంపాదించాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్ 1కి అర్హత సాధించాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది.

ప్రస్తుతం, పంజాబ్ జట్టు ఇప్పటికే టాప్-2లో స్థానం ఖాయం చేసుకొని క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఇక మిగిలిన ఒక టాప్-2 స్థానం కోసం ఆర్సీబీ, గుజరాత్ జట్లు పోటీ పడుతున్నాయి.

ఈ రోజు ఆర్సీబీ లక్నోపై విజయం సాధిస్తే.. వారు టాప్-2లోకి ప్రవేశించి క్వాలిఫయర్-1లో పంజాబ్‌తో తలపడతారు. అయితే, ఆర్సీబీ నేటి మ్యాచ్ లో ఓడిపోతే.. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు టాప్-2లోకి ప్రవేశిస్తుంది. అలా అయితే, ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ ఆర్సీబీకి అత్యంత కీలకంగా మారింది.

లక్నో vs బెంగళూరు ముఖాముఖి !

ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు సార్లు పోటీపడగా, ఆర్సీబీ మూడు విజయాలు నమోదు చేసింది. లక్నో రెండు సార్లు విజయం సాధించింది.

మ్యాచ్ లో రికార్డులకు ఛాన్స్ :

విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 24 పరుగులు సాధిస్తే.. ఆర్సీబీ తరఫున 9000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయ‌ర్ గా అవ‌త‌రించ‌నున్నాడు.
మయాంక్ అగర్వాల్ – IPLలో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి కేవలం 2 సిక్సులు అవసరం.
అయుష్ బడోనీ – 1000 IPL పరుగుల మైలురాయికి 37 పరుగులు దూరంలో ఉన్నాడు.
రవి బిష్నోయి – LSG తరఫున 50 వికెట్లు పూర్తి చేయడానికి ఇంకా 2 వికెట్లు కావాలి.

Leave a Reply