Crime News | తాగుబోతుల వివాదంలో మ‌ధ్యవ‌ర్తి బలి…

హైద‌రాబాద్ – ఉప్పల్​ లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మోతాదుకు మించి తాగారో ఏమో తెలియదు కాని ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుండగా మరో వ్యక్తి ( పవన్​ కుమార్​) నచ్చచెప్పేందుకు వెళ్లాడు. ఇక అంతే అందులో ఒకరు మధ్యవర్తిగా వచ్చిన పవన్​ కుమార్​ ను హత్య చేశారుడు. ఈ ఘటన రామంతాపూర్​ గుడ్​ డే బార్​ లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతాపూర్​ లోని గుడ్​ డే బార్​ లో ఆదివారం ( మే 25) రాత్రి పవన్ కుమార్(25) అ నే వ్యక్తిని శ్రవణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో పొడ‌వ‌డంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రవణ్.. అతని మిత్రుడు హరి మధ్య ఘర్షణ జరుగుతుండగా గొడవను ఆపేందుకు పవన్​ కుమార్​వెళ్లాడు. దీంతో చేతిలో ఉన్న బీరు సీసాతో పవన్​ను పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పవన్​ కుమార్​.. హరి.. శ్రవణ్​ ముగ్గురూ పరిచయస్తులే. వీరిని అంబర్​ పేట.. పటేల్​ నగర్​ వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఓవ‌ర్ డ్రింక్ తో మ‌ర‌ణం
ఆదివారం రాత్రి పబ్‌లో పార్టీ జరిగింది. తెల్లవారేసరికి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. హర్షవర్ధన్ అనే వ్యక్తి సికింద్రాబాద్ లోని ఓ ఏసీ కంపెనీ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి కొండాపూర్ క్వాక్ పబ్‌లో ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్నాడు. పబ్ నుంచి గచ్చిబౌలిలోని అపార్టుమెంట్‌కు హర్షవర్ధన్, అతని స్నేహితులు వచ్చారు. అపార్టుమెంట్‌లో మరోసారి అందరూ మద్యం సేవించారు. అయితే తెల్లవారుజామున హర్షవర్ధన్‌కు వాంతులు అయ్యాయి. దీంతో అతని స్నేహితులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఆస్పత్రికి చేరుకుని అనుమానాస్పద స్థితి మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా హర్షవర్ధన్ విజయనగరం జిల్లా ప్రసాద్ నగర్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

స్కూటీపై విద్యుత్ తీగ‌లు ప‌డి భార్య మృతి

కీసర నాగారంలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలపై విద్యుత్ తీగ తెగిపడింది. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. భర్త, మూడేళ్ల బాబుకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బాపురెడ్డి కాలనీకి చెందిన సురేశ్, మౌనిక.. తమ మూడేళ్ల కుమారుడు శ్రేయాస్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఈదురుగాలులకు తెగిపడ్డ విద్యుత్ తీగ బైక్‌పై పడింది. మౌనికపై తీగ పడటంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భార్య మౌనిక మృతి చెందింది. సురేష్, శ్రేయాస్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భార్య‌పై క‌త్తితో భ‌ర్త దాడి ..

ఫిలింనగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. కొబ్బరి బొండాలు నరికే కత్తితో భార్యపై భర్త అప్పల నాయుడు దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply