BCCI | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు వరుణ్ చక్రవర్తి….
ఇంగ్లండ్‌తో ఈ నెల 6 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ మేరకు వరుణ్ చక్రవర్తిని భారత జట్టులోకి తీసుకుంటూ బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వెన్ను నొప్పికి గురైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక అతడి ప్లేసులో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.