న్యూ ఢిల్లీ – మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు చత్తీస్ గడ్ నారాయణపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించడంపై ప్రధాని మోదీ స్పందించారు.. నక్సల్స్ పై జరుపుతున్న పోరాటంలో ఘన విజయం సాధించమంటూ ట్విట్ చేశారు.. అగ్రనేతతో ఇతర నక్సల్స్ ను నిర్మూలించడంలో మన దళాలు చూపుతున్న ధైర్యాన్ని చూసి గర్విస్తున్నానని అన్నారు.. దేశఃంలో మావోయిజం ముప్పును సమూలంగా నిర్మూలించడానికి, ప్రజలకు శాంతిని అందివ్వడానికి తమ ప్రభుత్వ కట్టుబడి ఉందని పేర్కొన్నారు..ఈ సందర్బంగా ఆపరేషన్ కగార్ లో పాల్గొన్న భద్రతా సిబ్బందిని అభినందించారు మోదీ.
Great Victory | నక్సలిజంపై పోరులో ఘనవిజయం.సాధించాం : ప్రధాని మోదీ
