నల్లగొండ, ఆంధ్రప్రభ – సమస్యలను గాలికి వదిలి నోటీస్ లు ఇస్తున్నారని రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులిచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు.
నల్లగొండలో నేడ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదు.. కమీషన్ల పాలన అని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది అని ధ్వజమెత్తారు. కమీషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదు. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమీషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎస్ ఎల్ బిసి టన్నెల్ కూలి, 8 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు… అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది రేవంత్ సర్కార్ కు లేకపోయిందన్నారు… మీ కమిషన్‌ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారని మండిపడ్డారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదన్నారు… ప్రజల సమస్యలపై కాకుండా పచ్చినాటకంపై దృష్టి ఉంచి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారన్నారు కెటిఆర్.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి.. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు అని అన్నారు. మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి? మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కమిషన్ లు, కమీషన్ల ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.