కోవూరు : నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒకరు మృతిచెందగా, కారులో ఉన్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.