NC24 | నాగ చైతన్య కొత్త అడ్వెంచ‌ర్…

‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ చైతన్య ప్రస్తుతం అదే ఉత్సాహంతో కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. నాగ చైతన్య తన తదుపరి సినిమా #NC24 ను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో చేస్తున్నాడు. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అయితే, తాజాగా విడుదలైన ఒక్క వీడియోతో సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేశారు.

ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, SVCC బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరూపాక్ష చిత్రానికి సంగీతాన్ని అందించిన అజనీష్ బి.లోకనాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Leave a Reply