మణుగూరు, ఏప్రిల్ 21 (ఆంధ్రప్రభ): మణుగూరులోని అవినీతి శాఖ అధికారులు మెరుపు దాడి చేసి పోలీస్ అవినీతి అధికారితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… కూరాకుల శ్రీనివాసరావును ఒక కేసులోతప్పించేందుకు మణుగూరు సతీష్ కుమార్ నాలుగు లక్షల రూపాయలను డిమాండ్ చేశారని తెలిపారు.
నాలుగు లక్షల రూపాయల్లో ఒక రూ.లక్ష మధ్యవర్తి అయిన మిట్టపల్లి గోపి ఓ షాపు వద్ద లక్ష రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. నాలుగు లక్షల రూపాయల్లో లక్ష రూపాయలు గోపికి ఇవ్వమని మరో మూడు లక్షలు ఇంకొక సారి చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఫిర్యాదుదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమే కాకుండా మణుగూరు సీఐ సతీష్ కుమార్ ను మిట్టపల్లి గోపిని అదుపులోకి తీసుకొని వరంగల్ ఏసీబీ జైలుకు తరలిస్తున్నామని తెలిపారు.
