నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : నిబంధనలు పాటించని గిరిజ మెడికల్ షాప్ లైసెన్స్ ను సస్పెండ్ చేసినట్లు డ్రగ్స్ నియంత్రణ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. తాత్కాలికంగా మెడికల్ షాప్ ను మూసివేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డ్రగ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 5న గిరిజ మెడికల్ షాప్ లో డ్రగ్ ఇన్ఫెక్టర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ లో ఫార్మసిస్టు లేకపోవడం, ఎలాంటి రికార్డులు లేక పోవడం, ఎప్పటికప్పుడు రోజు వారీగా నమోదు చేయాల్సిన బిల్స్ కూడా ప్రాపర్ గా నమోదు చేయలేదనీ తెలిపారు.
తనిఖీ లు చేసిన రెండు రోజుల అనంతరం గిరిజ మెడికల్ షాప్ కు నోటీసులు అందజేసినట్లు అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని గిరిజ మెడికల్ షాప్ కు డ్రగ్స నియంత్రణ అధికారులు సూచించినట్లు అధికారి తెలిపారు. గిరిజ మెడికల్ షాప్ వివరణ ఇచ్చినా అనంతరం బుధవారం నిబంధనలు పాటించని గిరిజ మెడికల్ లైసెన్సుని డ్రగ్ నియంత్రణ శాఖ అధికారులు సస్పెండ్ చేసి తాత్కాలికంగా మెడికల్ షాప్ ను మూసివేశారు.