హైదరాబాద్ : ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎనికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈరోజు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగారకుంట నవీన్ కుమార్ రెడ్డి దాసోజు శ్రవణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసనమండలిలో ప్రజా ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని శుభాకాంక్షలు తెలియజేశారు.
HYD | ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం
