ముంబాయి – భారత స్టాక్ మార్కెట్ సూచీలతో పాటు నిఫ్టీలు లాభాల్లో నేడు ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 1,547 పాయింట్లు లాభపడి 76,704 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 463 పాయింట్ల లాభంతో 23,292 వద్ద ట్రేడ్ అవుతోంది
అమెరికా డాలర్ ఇండెక్స్ 99.84 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.79 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.64 శాతం పుంజుకుంది.కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌సహా పలు ప్రొడక్టులపై ట్రంప్ టారిఫ్‌లను ఎత్తివేశారు. సుంకాల అమలును 90 రోజులపాటు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.