సౌందర్య లహరి

54. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే
దయా మిత్రైర్నేత్రైరరుణ ధవళ శ్యామ రుచిభిః
నదశ్శోణో గంగా తపన తనయేతి ధృవ మయం
త్రయాణాంతీర్థానాముపనయసిసంభేదమనఘమ్.

తాత్పర్యం : శివుడికి అధీనమైన మనస్సు కల పార్వతీదేవీ! దయతో ఆర్ద్రమైనవిఎఱుపు, తెలుపు, నలుపు అనే మూడు కాంతులతో శోభిల్లే నీ మూడు కన్నులు ఆ యా వర్ణాలతో కూడిన ప్రవాహాలు కల శోణానదమును,గంగాయమునా నదులను తమ పుణ్యతీర్థములతో పాపాలని పోగొట్టి అపవిత్రులని పవిత్రులుగా చేయటానికి త్రివేణీ సంగమ స్థానముగా ఒక చోటికి చేరుస్తున్నట్టుగా ఉన్నాయి.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply