జర్నలిజం ముసుగులో నీచ‌మైన‌ రాజకీయాలు తగునా..?

జర్నలిజం ముసుగులో నీచ‌మైన‌ రాజకీయాలు తగునా..?

రాప్తాడు, ఆంధ్రప్రభ : నైతిక విలువలు వదిలేసి సభ్య సమాజం తలదించుకునేలా మహిళలను వైసీపీ కార్యకర్తలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం రాప్తాడు మండల కేంద్రంలోని వైసిపి పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు వైసిపి నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ ఛాన‌ల్ య‌జ‌మాని నిర్వ‌హించిన‌ కార్యక్రమంలో మహిళలను, వైసిపి కార్యకర్తలను కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు.

పచ్చ పార్టీకి వంత పాడుతూ జర్నలిజం ముసుగులో నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఛాన‌ల్ య‌జ‌మానిపై విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చెబితే సొంత భార్యలను కూడా చెల్లెళ్లుగా భావించే వెన్నెముక లేని బ్యాచ్ అంటూ ఓ ఛాన‌ల్ య‌జ‌మాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక పార్టీని విమర్శించడం మాత్రమే కాదని మహిళా లోకాన్ని కట్టుకున్న భార్యలను అవమానించడమే అని మండిపడ్డారు.

రాధాకృష్ణకు అసలు సంస్కారం ఉందా? నీకు తల్లి, చెల్లి, భార్య లేరా? రాజకీయ విమర్శలు చేయాలంటే నీతిగా చేయాలి. అంతేకానీ వైసీపీ కార్యకర్తల భార్యల గురించి అంత నీచంగా మాట్లాడతారా? జర్నలిజం పేరుతో నువ్వు చేస్తున్నది అరాచకమని అన్నారు. ఆ ఛానల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోసారి నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ నెల 4వ తేదీన ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న యాంకర్ ఎడిటర్, మేనేజ్‌మెంట్ అందరినీ బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. ఏబీఎన్ వైఖరిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మరూరు వెంకటేష్ వైసీపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపిపి బోయ రామాంజనేయులు, మాజీ కన్వీనర్ శేఖర్, మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, రూరల్ జెడ్పిటిసి జూటూరు శేఖర్, నరసింహారెడ్డి, చెన్నారెడ్డి, నారాయణ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply