bumrah vs vaibhav| ఈ రోజు నువ్వా.. నేనా..?

bumrah vs vaibhav| ఈ రోజు నువ్వా.. నేనా..?

యార్క‌ర్ కింగ్ వ‌ర్సెస్ సిక్స‌ర్ల పిడుగు
ఇవాళ ముంబై, రాజస్థాన్ ఢీ
వైభ‌వ్ వ‌ర్సెస్ బుమ్రా ఆస‌క్తిక‌రం
ఇద్ద‌రి మ‌ధ్య పోరు కోసం అభిమానుల ఎదురుచూపు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆసక్తికర పోరు జ‌ర‌గ‌నుంది. అది రెండు జ‌ట్ల మ‌ధ్య అని అంతా అనుకుంటే పొర‌పాటే.. అంద‌రూ ఎదురుచూస్తున్న‌ట్లు… బుడ్డోడు వ‌ర్సెస్ బూమ్రా అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇవాళ‌ గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొన‌నున్నాయి. అయితే ఈ మ్యాచులో అంద‌రి చూపు చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ, యార్క‌ర్ కింగ్ బుమ్రా పైనే అంద‌రి దృష్టి ఉంది. ఎందుకంటే ప్ర‌స్తుతం ఇండియ‌న్ క్రికెట్‌లో వీరి చాలా ఫేమ‌స్. బుమ్రా చాలా అనుభ‌వ‌జ్ఞుడు. కానీ వైభ‌వ్ మాత్రం భారత క్రికెట్ భవిష్యత్తుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. వీరిద్ద‌రు ఇవాళ జ‌రిగే మ్యాచులో ఢీకొన‌బోతున్నారు.

ఈ ఇద్దరి మధ్య జరగబోయే పోరు కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో రెచ్చిపోతున్న వైభ‌వ్‌.. ఈ మ్యాచులో బుమ్రాను ఎలా ఎదుర్కుంటాడా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పటి వరకు బుమ్రా, వైభవ్ సూర్యవంశీ ముఖా ముఖిగా తలపడలేదు. గతేడాది జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని దీపక్ చాహర్ డకౌట్ చేశాడు. దాంతో ఈ కుర్రాడికి బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం దక్కలేదు. కానీ ఆ మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీ మరింత రాటు దేలాడు. తన ఆటతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దేశవాళీ క్రికెట్‌లో రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌ను కూడా ఈ 15 ఏళ్ల బిహార్ కుర్రాడు ఘనంగా ప్రారంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 18 బంతుల్లో 31 పరుగులతో దూకుడు కనబర్చాడు. సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.

ఈ రోజు ముంబై బౌలర్ల పని పట్టేందుకు బుడ్డోడు సిద్ధ‌మ‌వుతున్నాడు. బుమ్రానా.. బుడ్డోడా అన్న‌ట్లు వార్ జ‌ర‌గ‌నుది. ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుదుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. వైభవ్ సూర్యవంశీని కట్టడి చేసేందుకు బుమ్రానే స‌రైనోడు అని అంతా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ త‌న ప్ర‌తాపాన్ని బుమ్రాపై చూపుతాడా.. ? లేదా బుమ్రా యార్క‌ర్ల‌కు బెంబేలెత్తుతాడా అనేది చూడాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే.

Leave a Reply