ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో..

ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో..

మధిర, ఆంధ్రప్రభ : మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబారుపేట గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిర మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన తోక వెంకయ్య (55) మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply