ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు

ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్రామ్ 119వ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా సంఘాల సమన్వయంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ బొల్లం శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు, త్యాగాలను స్మరించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూమాల మహేష్, వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply