AP | దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్..

AP | దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్..

AP |నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి నగలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు.

గత ఏడాది నుంచి నంద్యాల జిల్లాలోని నంద్యాల తాలూకా, బండిఆత్మకూరు, రేవనూరు, సంజామల, గడివేముల, బేతంచర్ల, అవుకు తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం. జావళి ఆల్ఫోన్స్ ఆధ్వర్యంలో తాలూకా ఇన్‌స్పెక్టర్ ఈశ్వరయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు.

శుక్రవారం పట్టణ శివారులోని నందమూరి నగర్ రోడ్, నాగులకట్ట సమీపంలోని టీ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని పల్సర్ మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తి పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో అతను వైఎస్సార్ నగర్‌కు చెందిన షేక్ బాబావలి అని గుర్తించారు. అతను పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తిరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి నగలు మరియు రూ.50,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బంది రవికుమార్, గంగాధర్, ఇబ్రహీం, మలిక్ బాషా, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, గంగారం, కృష్ణమ నాయుడు లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply