AP | ముగ్గురు యువకులు మృతి

AP | ముగ్గురు యువకులు మృతి

AP | ఆంధ్రప్రభ, వెబె డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అనకాపల్లి జిల్లాలోని పోతిరెడ్డిపాలెం వద్ద ఇవాళ‌ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసుల సమాచారం ప్రకారం… మృతులు పురుషోత్తపురం గ్రామానికి చెందినవారుగా గుర్తించబడ్డారు. బస్సు బైక్‌ను అదుపు తప్పించడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి పరిశీలనలు కొనసాగుతున్నాయి.

Leave a Reply