విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఎర్ర జాన్సన్

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఎర్ర జాన్సన్

ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చాలని శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ విజయశాంతిని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెంకు చెందిన రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంఘం నాయకులు ఎర్ర జాన్సన్ మంగళవారం సాయంత్రం కలుసుకున్నారు.

ఉద్యమకారుల పక్షాన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. రెండున్నర సంవత్సరాల కాలంగా ఉద్యమకారుల వేదనను శాసనమండలి సాక్షిగా వినిపించినందుకు ధన్యవాదాలు చెప్పి ఈ విషయంలో ప్రభుత్వ పరంగా పూర్తి సానుకూలత వచ్చేందుకు, సత్వర కార్యాచరణ జరిగేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఆమెకు ఉద్యమకారుల తరఫున జాన్సన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply