వేలానికి ముందే అక్రమ ఇసుక రవాణా యత్నం విఫలం

నార్సింగి, ఆంధ్రప్రభ ; మండలంలో అక్రమ ఇసుకను బహిరంగ వేలానికి నిర్ణయించిన నేపథ్యంలో, రాత్రి సమయంలో కొందరు ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. ఒక జేసీబీతో పాటు మూడు ట్రాక్టర్ల సహాయంతో ఇసుకను తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జేసీబీతో పాటు మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply