ఆరో తరగతి బాలికపై దారుణం

ఆరో తరగతి బాలికపై దారుణం
- బంధుత్వాన్ని మరిచి అత్యాచారం
- గంజాయి మత్తులో నిందితుడి దురాగతం
- ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు
- కేసు నమోదు, కొనసాగుతున్న దర్యాప్తు
ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండలం పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న బాలికపై అదే కుటుంబానికి చెందిన యువకుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, తుళ్లూరు వంశీ అనే వ్యక్తి తనకు వరసకు చెల్లి అవుతున్న బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
నిందితుడు గంజాయి మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునే చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
