2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల

2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల
మోర్తాడ్/భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఈరమణి నిర్మల వెన్నెముక సమస్య తో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ చికిత్స కోసం చేరడం జరిగింది. స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ వెన్నెముక సర్జరీ కోసం 2,00,000 ఎల్ఓసి మంజూరు చేయించి ఎల్ఓసి ని శుక్రవారం హైదరాబాద్ లోని నివాసంలో వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల అందజేశారు.ఈ సందర్బంగా చికిత్స కొరకు ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే కి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
