ఘనంగా సీతారాముల కళ్యాణం..

ఘనంగా సీతారాముల కళ్యాణం..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణం కన్నుల పండుగ కొనసాగింది. రాములోరి కళ్యాణం వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్యన అశేష ప్రజానీకం మధ్యన రాములోరీ కళ్యాణం రంగ రంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతుంది. సీతారామచంద్రస్వామి ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి చింతం యాదగిరి కార్యవర్గ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. దేవాలయం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
త్రాగునీరు, శ్రీరామపానకం అందుబాటులో ఉంచారు. భక్తులకు అసౌకర్యం కల్వకుండ భక్తులందరికీ రాములోరి కళ్యాణం వీక్షించేందుకు స్క్రీన్లు ఏర్పాటు చేసి నేరుగా ప్రసారం చేస్తున్నారు. కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు అభిషేక్ శర్మ, ముక్కు కృష్ణ శర్మ, , శామంతుల బిక్షపతి సాదుల దామోదర్,,శ్రీరాం రాజేష్, బూదరపు భాస్కర్, ఆడపు శ్యామ్, కుడి కాలసురేందర్, ఉప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.,ఎలాంటి అసౌకర్యం కలవకుండా మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
